Prime9

Ram Gopal Varma: సూపర్ స్టార్ మరణం పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్

Tollywood: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణ మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ ఇకలేరని బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ పాటికే కృష్ణగారు, విజయ నిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ సంతోషంగా ఉండి ఉంటారు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ ట్వీట్ చేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ను జతచేశారు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, కృష్ణ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు. మహేశ్ బాబును పరామర్శిస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar