Site icon Prime9

Ram Gopal Varma: “వ్యూహం“ సినిమా పై రామ్ గోపాల్ వర్మ ఈక్వేషన్

Ram Gopal Varma

Ram Gopal Varma

Tollywood: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే సినిమా ‘వ్యూహం’ ‘శపథం’ పేరుతో రెండు పార్టులుగా ఉంటుందని గురువారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వర్మ ఈ సినిమాకు సంబంధించి లెక్కల్ని ట్విట్టర్ వేదికగా చెప్పారు.

బీజేపీ ÷ పీకే X చంద్రబాబు- నారా లోకేష్+జగన్ అంటూ ఈక్వేషన్ రాసారు. బీజేపీతో పాటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్‌ల పేర్లను ప్రస్తావించారు. మొత్తం మీద ఈ చిత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ ఉంటుందని భావించవచ్చు. మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 “శపథం“ లో తగులుతుందని వర్మ నిన్ననే తెలిపారు.

అంతేకాదు ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు, కనక చెప్పట్లేదు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

 

Exit mobile version