Ram Gopal Varma: ఆర్జీవీ అంటేనే వివాదాలకు పెట్టింది పేరుగా చెప్తుంటారు. అయితే ఆయన రీసెంట్ గా చేసిన ఓ పోస్ట్ ఇందుకు అద్దం పడుతూ రొటీన్ కు కాస్త భిన్నంగా ఉంది. పుట్టిన రోజు ఎవరైనా ఏం చేస్తారు సాధారణంగా కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్‌డే సాంగ్‌తో ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ చిల్ అవుతారు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతూ ఆనందంగా ఉంటారు. కానీ మన వివాదాస్పద డైరెక్ట్ ఆర్జీవీ మాత్రం అందుకు డిఫరెంట్. ఏప్రిల్ 7 తన పుట్టినరోజు సందర్భంగా వర్మ తన బర్త్ డేను పిచ్చ డిఫరెంట్ గా చేసుకున్నారు. బర్త్‌డే రోజు చావు పాట విడుదల చేసి అందరికీ దిమ్మతిరిగిపోయేలా చేశాడు.
నేనింతే నాకు ఇష్టమొచ్చినట్టు బతుకుతా(Ram Gopal Varma)
ఇక మన రాంగోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే అన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడూ ఎలా ఆలోచిస్తారు, ఏం మాట్లాడుతారు అన్నది అర్థం చేసుకోవడం కూడా కష్టమే. సందర్భం ఎలాంటిది అయినా.. తాను అనుకున్నది అనుకున్నట్టుగా సూటిగా చెప్పేస్తారు వర్మ. ఈ క్రమంలోనే వర్మ కొన్నిసార్లు ప్రశంసలు అందుకుంటే.. ఎక్కువ సార్లు మాత్రం విమర్శలు ఎదుర్కొంటారు.
Here’s my DEATHDAY song on my BIRTHDAY https://t.co/mt0DPiVnrs
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2023
కానీ అవేం తనకు పట్టనట్టు ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు వర్మ. నా లైఫ్ నా ఇష్టమంటూ ఉండే రాం గోపాల్ వర్మకు అభిమానులు కూడా ఎక్కువేనండోయ్. ఆయన ఫిలాసఫి ఇష్టపడేవారి సంఖ్య కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఏప్రిల్ 7 వర్మ పుట్టినరోజు.. నా బర్త్ డే రోజున నాకు ఎవరూ విష్ చేయకండి అంటూ.. పుట్టినరోజున చావు పాటను రిలీజ్ చేసుకున్నారు వర్మ. ఇక అందరూ చేసేదే చేస్తే ఆయన ఆర్జీవీ ఎందుకు అవుతాడు చెప్పండి.
ఆర్జీవిజమ్, ఏ ట్రిబ్యూట్ టు రాంగోపాలవర్మ అంటూ మొదలైన ఈ సాంగ్.. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నాకు ఇష్టమొచ్చినట్టు బతుకుతా, మీరెవరు నన్ను అడగడానికంటూ రాంగోపాలవర్మ మాట్లాడుతోన్న మాటలతో ముగుస్తుంది.