Prime9

Ram Charan: స్పోర్ట్స్ డ్రామాగా రామ్ చరణ్ తదుపరి చిత్రం

Tollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌కి సైన్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నందున ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వినపడలేదు. ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం దర్శకుడు ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం.

ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని, మరో ఇద్దరు దర్శకులు సుకుమార్ మరియు బుచ్చిబాబు సన సహాయంతో దర్శకుడు స్క్రిప్ట్‌ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత చిత్రీకరణ ప్రారంభమై 2023లో పూర్తవుతుందని కూడా చెబుతున్నారు. చరణ్ RC15ని హోల్డ్‌లో ఉంచి RC16 సెట్స్‌లో జాయిన్ అవుతాడని టాక్.

రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా చేయడం ఇదే తొలిసారి కాబట్టి మెగా అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. స్క్రిప్టు ఖరారు కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశముంది.

Exit mobile version
Skip to toolbar