Site icon Prime9

Ram Charan: రామ్ చరణ్- గౌతమ్ ప్రాజెక్టు అందుకే ఆగిందా?

ram-charan gowtam-tinnanuri

Tollywood: రామ్ చరణ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని, నెలరోజుల క్రితం అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ చిత్రం ఆగిపోయింది. చరణ్ ప్రాజెక్ట్ ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. జెర్సీ హిందీ వెర్షన్ ఫలితం చరణ్‌ని గౌతమ్‌ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెట్టేలా చేసిందనే టాక్స్ ఉన్నాయి. స్క్రిప్టు పై రీవర్క్ చేయమని చరణ్ గౌతమ్‌ని కోరాడని ఊహాగానాలు చేశాయి. అది కూడా నిజం కాదు.

నెలల తరబడి స్క్రిప్ట్‌పై వర్క్‌ చేసిన గౌతమ్‌ ఇటీవలే రామ్‌ చరణ్‌కి వినిపించాడు. తరువాత చరణ్‌, గౌతమ్‌ని మెగాస్టార్ చిరంజీవికి స్క్రిప్ట్ చెప్పమని కోరాడు. మెగాస్టార్ కు స్క్రిప్ట్‌ నచ్చకపోవడంతో వెంటనే సినిమాను తిరస్కరించారు. మెగాస్టార్ ను స్క్రిప్టు అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ చరణ్ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. గౌతమ్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే.

ప్రస్తుతం రామ్ చరణ్ స్క్రిప్ట్‌లు వింటున్నాడు. పలువురు దర్శకులను కలుస్తున్నాడు. సెప్టెంబర్‌లో శంకర్‌ సినిమా షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించనున్నారు.

Exit mobile version