Site icon Prime9

Ram Charan : విశ్వక్ సేన్ పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానంటున్న రామ్ చరణ్

ram charan 2 prime9news

ram charan 2 prime9news

Ori Devuda Pre Release Event: విశ్వక్ సేన్ చేసింది తక్కువ సినిమాలే ఐనా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఓరి దేవుడా ఈ సినిమా విడుదలకు సిద్దమయింది.ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ఓమై కడువలే…ఈ సినిమా తెలుగులోకి రీమేక్ చేసి విడుదల చేస్తున్నారు.ఈ సినిమాని పివిపి ప్రొడక్షన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు.ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోని రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలోనే జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంటులో రామ్ చరణ్ పాల్గొని సినిమా యూనిట్ కు కృతజ్ఞతలు తెలపడమే గాక విశ్వక్ సేన్ మీద ఒక రేంజులో ప్రశంసల వర్షం కురిపించారు.విశ్వక్ సేన్ ఆటిట్యూడ్ చూపిస్తాడని,దూకుడు ఎక్కువ,నోటి దురుసు కూడా ఎక్కువని ఇలా చాలా అతని మీద రక రకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఆయనలో ఉన్న ఒక మంచి విషయాన్ని రామ్ చరణ్ బయటకు వెల్లడించారు.

విశ్వక్ సేన్ కు చాలామంది అభిమానులు ఉండవచ్చు కానీ నేను అతని పర్సనాలిటీకి పెద్ద అభిమానిని అని సినిమాలో హీరో కన్నా బయట అతని పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని అంటూ రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అంతేకాక ఈ పర్సనాలిటీని ఇలాగే కంటిన్యూ చేయాలని విశ్వక్ సేన్‌కు రామ్ చరణ్ సూచనలు చేశారు. ‘‘పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ రజినీకాంత్ గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్లందరూ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ ఐనా అభిమానులు ఓకెలా భావిస్తారు,ఒక సూపర్ స్టార్‌గా ఉండాలంటే నీ పర్సనాలిటీయే నిన్ను అక్కడకు తీసుకెళ్తుందని రామ్ చరణ్ ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Exit mobile version