Site icon Prime9

Raghava Lawrence: ఆయన ఆఖరి చూపుకు నోచుకోకపోవడం నా దురదృష్టం.. రాఘవ లారెన్స్

Raghava Lawrence condoles rebel star krishnam raju

Raghava Lawrence condoles rebel star krishnam raju

Tollywood: తెలుగు చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి విషయాన్ని టాలీవుడ్ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా తాను రెబల్ స్టార్ కడసారి చూపుకు నోచుకోలేపోయానంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు మృతి పట్ల రాఘవ లారెన్స్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాను కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ చూసుకుంటారని లారెన్స్ తెలిపారు. తల్లి పిల్లలకు ఎలా ఆలనాపాలనా చూస్తుంటదో కృష్ణంరాజు కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తాను ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారి చూసుకోలేకపోయానంటూ బరువెక్కిన హృదయంతో తెలిపారు. కాగా కృష్ణంరాజు లెగసీ ప్రభాస్ ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు లారెన్స్ తెలిపారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి రెబల్ అనే సినిమాను రాఘవ లారెన్స్ చేశారు.

ఇదీ చదవండి: RGV: స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ.. సిగ్గు.. సిగ్గు..

Exit mobile version