Site icon Prime9

Project K: ప్రాజెక్టు కె చాలా స్పెషల్.. దర్శకుడు నాగ్ అశ్విన్

Project K

Project K

Tollywood: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం పై అటు పరిశ్రమ, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే మూవీ ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.

సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుంది. కథ తాజాగా ఉంది. సినిమా అంతా కొత్తగానే ఉంది. కార్లు, బిల్డప్, సెట్లు మరియు కార్లు, ప్రతిదీ కొత్తవి. సినిమా కోసం అన్నింటినీ కొత్తగా రూపొందిస్తున్నాం నాగ్ అశ్విన్ అన్నారు. ఈ సినిమాలో ఇంతకుముందెన్నడూ చూడని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులు పొందుతారని చెప్పారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version