Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిపాత్రలో కనిపించనున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ మూవీ ఈనెల 16వ తేదీని విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శ్రీవారు కొలువై ఉన్న ప్రాంతమైన తిరుగుపతిలో ఘనంగా నిర్వహించన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందడి మొదలైంది. ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.
తిరుపతిలో సందడి చేసిన ప్రభాస్(Adipurush)
ఇక ఈ తరణంలో చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. కాగా తాజాగా మంగళవారం ఉదయం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్ర యూనిట్ అంతా కలిసి స్వామివారిని సుప్రభాత సేవలో దర్శించి తరించారు.
అయితే ప్రభాస్‌ను తిరుమల వచ్చారని తెలిసి భక్తులు ఆయనను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ వద్ద, మహాద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రభాస్ ను చూసేందుకు పోటెత్తిన జనాన్ని పోలీసులు విజిలెన్స్ అధికారులు అదుపు చేయలేకపోయారు. దీనితో అతి కష్టం మీద ప్రభాస్ ను భక్తుల నుంచి తప్పించి పోలీసులు ఆయన కారులో పంపించారు. అక్కడి నుంచి ప్రభాస్ గెస్ట్ హౌస్‌కి చేరుకునేసరికి ఆయన బస చేస్తున్న గెస్ట్ వద్దకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. గెస్ట్ హౌజ్ చుట్టుపక్కలంతా కూడా భక్తుల కోలాహలం నెలకొంది.