Site icon Prime9

Salaar Movie: సలార్ కు లీకుల బెడద.. ప్రభాస్ మాస్ లుక్ అదుర్స్

salaar movie photo leak

salaar movie photo leak

Tollywood: ప్రభాస్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. డార్లింగ్ సినిమాలకు క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి ప్రభాస్ మూవీలకు లీకుల బెదడ తప్పడం లేదు. రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతితో కొద్దిరోజులు ఫ్యామిలీతోనే గడిపిన డార్లింగ్ ప్రభాస్, ఇటీవలే తిరిగి సెట్స్ లో అడుగుపెట్టాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రుతి హాసన్ కథానాయికగా, ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ లో డార్లింగ్ పాల్గొన్నాడు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ షూటింగ్ కి సంబంధించి తాజాగా ఓ ఫొటో లీక్ అయ్యి అది నెట్టింట వైరల్ అవుతుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న డార్లింగ్  త్వరలోనే అభిమానులను ఫుల్ జోష్ చెయ్యనున్నారు. అంతేకాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా భారీ లెవెల్లోనే ఉన్నాయి. అయితే గతకొద్దికాలంగా క్షణం తీరిక లేకుండా సినిమాలతో గడుపుతున్న ప్రభాస్, ఇటీవల ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు మరణంతో షూటింగ్స్‏కు కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు.

కాగా ఇటీవల తిరిగి సెట్స్ లో అడుగుపెట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. ఇదిలా ఉంటే గతంలో షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరోసారి ప్రభాస్ యాక్షన్ సన్నివేశానికి చెందిన ఓ పిక్ నెట్టింట వైరలవుతుంది. అందులో డార్లింగ్ ఫుల్ మాస్ అండ్ రఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక డార్లింగ్ లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: “రానా నాయుడు” టీజర్ అదుర్స్… ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ అబ్బాయ్

Exit mobile version