Site icon Prime9

Prabhakar: తన కొడుకు పై వస్తున్న ట్రోలింగ్‌ పై స్పందించిన ప్రభాకర్

chandrahas prime9news

chandrahas prime9news

Tollywood: బుల్లితెర ప్రభాకర్ తనయుడు చంద్రహాస్‌ సిని ప్రవేశం చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. తన కొడుకు ఒకేసారి మూడు సినిమాలకు ఓకె చెప్పినట్టు ప్రభాకర్ మీడియా వేదికగా తెలిపారు. తను బాగా కష్ట పడతాడాని మంచి హీరో అవుతాడని ఆయన తెలిపారు. ఐతే ప్రభాకర్ మాట్లాడినా తీరును, అదే సమయంలో చంద్రహాస్ ఆటిట్యూడ్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రహాస్ రెండు జేబుల్లో చేతులు పెట్టుని స్టైల్‌గా నిలబడిన విధానం చూసే నెటిజన్లకు అసలు నచ్చలేదు. దానితో మీమ్స్, ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో ఎవరి ఇస్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమా కూడా తీయలేదు. వీడికి ఇంత బలుపేంటి అని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

తన కొడుకు పై వస్తున్న ట్రోలింగ్‌ పై ప్రభాకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా వాడు వచ్చిందే ఇప్పుడు, వాడు సినిమా కూడా ఇంకా విడుదల అవ్వలేదు. మొన్నవాడిని ఇంట్రడ్యూస్ చేసిన ఫంక్షన్ను పిచ్చిపిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు. వీడు హీరో ఏంటి, జేబులో చేతులు పెట్టుకొని అటు ఇటు తిరిగాడేంటి అంటూ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎలా ఐతే ఏంటి నా కొడుకు జనాలకు తెలిశాడు. వాళ్లు నా కొడుకును తిడుతున్నారా, పొగుడుతున్నారా,  అనేది పక్కన పెడితే జనాలకు మాత్రం తెలిశాడు అది చాలు. ఇప్పుడు వాడు నిలబడిన విధానం జనాలకు నచ్చలేదు అందుకే వాళ్ళు మొహం మీద చెప్పేశారు. వాడు బాగా యాక్టింగ్ చేస్తే జనాలందరికి నచ్చుతాడు కదా అంటూ మీడియా ముందు తెలిపారు.

Exit mobile version