Site icon Prime9

Pooja Hegde: పూజాకు కాబోయే వరుడు ఎలా ఉండాలో తెలుసా.. పూజా అమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2014లో వచ్చిన ఒక లైలా కోసం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అందంతో పాటు అభినయంతోనూ వీక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ పొడుగుకాళ్ల సుందరి. కాగా తాజాగా సల్మాన్‌ ఖాన్‌తో కిసీకా భాయ్ కిసీకి జాన్ సినిమాలో కలిసి నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో పాగా వేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే తాజాగా మదర్స్‌ డే సందర్భంగా ఆదివారం పూజా హెగ్డే తన తల్లి లతతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ సందర్భంగా పూజా గురించి ఆమె తల్లి లత పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే(Pooja Hegde)

పూజకి కాబోయే భర్త ఎలా ఉండాలన్న ప్రశ్నకు లత బదులిస్తూ.. “పూజను అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి గురించి తాను ఎదురు చూస్తోంది. పెళ్లి అనే బంధం కలకాలం నిలిచి ఉండాలంటే భార్యాభర్తలిద్దరి భాగస్వామ్యం ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండటం చాలా కష్టం. ఆ బంధం నిలవదు. పూజ చాలా సున్నిత మనస్కురాలు. తన ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి. అతడు స్ఫూర్తిగా నిలవాలి. కెరీర్‌ని ప్రోత్సహించాలి. అలాంటి అబ్బాయినే తను కోరుకుంటోంది” అని లత చెప్పారు.

ఇక తల్లి మాటలతో పూజా ఏకీభవించింది. అలాగే తల్లితో తనకున్న అనుభవం గురించి పలు అనుభవాలను పంచుకుంది. తన జీవితంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి తల్లే అని చెప్పుకొచ్చిన పూజా.. అమ్మ కలలన్నీ నేను నెరవేర్చాననే అనుకుంటున్నానని తెలిపింది. ఇక తనకోసం చేసిన ప్రతీ పనికి కృతజ్ఞతలు అంటూ తల్లిపై ఉన్న తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది పూజా.

Exit mobile version