Site icon Prime9

Ponniyin Selvan trailer: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్

Ponniin-Selvan-Part-1-trailer

Tollywood: దర్శకుడు మణిరత్నం గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయాడు. అయితే అతని తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో అతను మరలా రికార్డులు తిరగరాయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు కమల్ హాసన్ మరియు రజనీకాంత్ ప్రారంభించారు.

మణిరత్నం తన సాధారణ శైలికి దూరంగా ఈ చిత్రం కోసం విజువల్ గ్రాండియర్‌ని ఎంచుకున్నాడు. ఆకాశం నుండి పడే ఉల్కాపాతం చోళ రాజ్యానికి చెందిన ఒకరికి చెడ్డ శకునంగా చూపబడింది.అది రాజుల మధ్య అంతర్గత విభేదాలకు దారి తీస్తుంది. ఒకరు ఆధిపత్యం కోసం, మరొకరు మనుగడ కోసం పోరాడుతుండగా అంతర్గత పోరాటాలు ప్రారంభమవుతాయి. . ట్రైలర్‌కి రానా వాయిస్‌ఓవర్ మంచి అట్రాక్షన్ గా నిలచింది

విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష మరియు ఐశ్వర్యరాయ్ యొక్క ప్రధాన తారల పెర్ఫార్మెన్స్‌తో పాటు, విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాండియర్ ట్రైలర్‌ను హైలెట్ చేశాయి. ఎఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉన్నాయి. మొత్తంమీద ట్రైలర్ మణిరత్నం అభిమానుల అంచనాలను అందుకునే విధంగా ఉంది.

 

Exit mobile version