Site icon Prime9

Devi Sri Prasad: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు…కారణం ఏంటంటే?

Police complaint against music director Devisree Prasad

Devi Sri Prasad: నేటి సినిమా రంగంలో అశ్లీలత పెరిగి కుటుంబసమేతంగా సినిమాలు చూడలేని పరిస్ధితి ఏర్పడింది. దీంతోపాటు ఆధ్యాత్మిక అంశాలకు సైతం అశ్లీలత జోడించి డబ్బులు సంపాదించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనను నిరసిస్తూ హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లో వెళ్లితే…

టాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని, ఓ పరి ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను కోరారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ‘ఓ పరి’ పేరుతో ఇటీవల ప్రైవేట్‌ వీడియో సాంగ్‌ను కంపోజ్‌ చేయడమే కాకుండా స్వయంగా ఆలపించాడు. పాన్‌ ఇండియా స్థాయిలో సంగీత అభిమానులను ఆకట్టుకునేలా వీడియో సాంగ్‌ను కంపోజ్‌ చేశాడు. ఈ సాంగ్‌లో హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఐటమ్‌ సాంగ్‌గా మార్చారంటూ కరాటే కల్యాణితో పాటు హిందూసంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: Actress Rambha: హీరోయిన్ రంభకు గాయాలు.. కారుకు యాక్సిడెంట్‌

Exit mobile version