Site icon Prime9

Oke Oka Jeevitham: ఆడియన్స్ మెచ్చిన ఒకే ఒక జీవితం.. అమ్మ పాట విడుదల

oke oka jeevitham movie amma song out

oke oka jeevitham movie amma song out

Tollywood: హీరో శ‌ర్వానంద్ చాలా కాలం త‌ర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. మ‌హానుభావుడు త‌ర్వాత వ‌రుస ఫ్లాప్ లతో ఉన్న శ‌ర్వాకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ ఈ సినిమా స‌క్సెస్‌ను ఆస్వాధిస్తున్నాడు.

ఒకే ఒక జీవితం, గత కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వసూళ్ల పర్వం కొనసాగిస్తుంది. భారీ రేంజ్‌లో ఒపెనింగ్స్ రాక‌పోయినా రోజు రోజుకు ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ఆధ‌ర‌ణ పెరుగుతుంది. రెండు భాషల్లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా స‌క్సెస్‌లో జేక్స్ బేజోయ్ సంగీతం ముఖ్య పాత్ర వ‌హించింద‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలోని అమ్మ పాట‌కు థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులు బాగా ఎమోష‌న‌ల్ అయ్యారంటే బేజోయ్ ఏ రేంజ్లో మ్యూజిక్ అందించారో చెప్పనక్కర్లేదు అనుకంటా.

అయితే తాజాగా ఈ పాట వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ర‌చించిన ఈ అంద‌మైన గీతాన్ని అంతే అందంగా  సిద్ శ్రీరామ్ గాత్రం అందించాడు. ఈ సాంగ్ కు థియేట‌ర్‌లో అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. కాల పయనం నేపథ్యంలో విడుదలైన ఈ సినిమాలో అక్కినేని అమ‌ల కీల‌క‌పాత్ర పోషించారు. శ‌ర్వాకు జోడీగా రీతూవ‌ర్మ న‌టించింది.

ఇదీ చూడండి: ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ చూసేద్దామా

 

Exit mobile version