Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ అంటే చాలు ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా నటిస్తోన్నారు. ఆయన నటిస్తున్నోన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఇక ఈ సినిమాపై ఫ్యాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మైథాలజీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ పై ఒకానొక సందర్బంలో విమర్శలు వెల్లువెత్తడంతో సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. అయితే ఇటీవలె శ్రీనామనవమి కానుకగా ఆదిపురుష్ నుంచి విడుదలైన సరికొత్త పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. ఆ పోస్టర్లో ప్రభాస్ శ్రీరాముడిగా బాలీవుడ్ అందాల తార కృతి సనన్ సీతగా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్న పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా మరోకొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
రామధూత హనుమాన్(Adipurush)
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ధ్యానంలో ఉన్న హనుమాన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు అభిమానులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ పరిశీలిస్తే బ్యా గ్రౌండ్ లో రాముడిగా ఉన్న ప్రభాస్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.