Site icon Prime9

Nani: ఇన్ని రోజులు ఇంత మంచి సినిమాను ఎందుకు చూడలేకపోయాను?.. బలగం మూవీపై హీరో నాని ట్వీట్

nani about balagam

nani about balagam

Nani: ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. ప్రముఖ కమెడియన్‌ వేణు దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం బలగం. తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఎన్నో భావోద్వేగాలను కళ్లకు కట్టినట్టు హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు వేణు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ కీలక పాత్రల్లో నటించారు. సినీ ఇండస్ట్రీ పెద్దలైన మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులు ఎందరో బలగం చిత్రాన్ని మెచ్చుకున్నారు. ఈ మూవీకి అంతర్జాతీయ అవార్డులు సైతం క్యూ కట్టాయి. వీటన్నిటికీ మించి తెలంగాణలోని చాలా గ్రామాలు పల్లెల్లో కూడా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసుకుని మరీ బలగం సినిమాను చూశారంటే ఈ మూవీకున్న ప్రత్యేకతేంటో మీరే అర్థం చేసుకోవచ్చు.

బలగంపై నాని రియాక్షన్(Nani)

అయితే తాజాగా న్యాచురల్ స్టార్‌ నాని బలగం సినిమాను చూశాడట. ఈ తరుణంలో నాని ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇన్ని రోజులు ఇంత మంచి సినిమాను ఎందుకు చూడలేకపోయాను? తాను ఇది అసలు నమ్మలేకపోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా నాని స్పందించాడు.

‘నేను ఇంత ఆలస్యంగా బలగం మూవీని చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది కదా తెలుగు సినిమా ఎప్పటి నుంచో కోరుకుంటుంది. వేణు, దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ సహా ఈ ప్రెస్టేజియస్‌ మూవీకి పని చేసిన వారందరికీ ధన్యవాదాలు. మీరందరూ సినిమాలో నటించలేదు జీవించేశారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నాని చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ‘ఇంత మంచి సినిమాను ఇంత లేటుగా చూశావేంటి బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు.

 

Exit mobile version