Site icon Prime9

The Ghost: ‘ది ఘోస్ట్’ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్

the ghost prime9news

the ghost prime9news

Tollywood: అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కొత్త సినిమా ‘ది ఘోస్ట్’ సినిమా. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా, ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ హీరోయిన్నుగా నటించింది. తాజాాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని ‘ది ఘోస్ట్’ సినిమాలో నాగార్జున ‘రా’ అనే ఏజెంట్ పాత్రలో మనకు దర్శనమివ్వనున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మనలని ఆకట్టుకుంటాయి. అలాగే యాక్షన్ సీన్లు హైలెట్‌గా నిలవనున్నాయి. ప్రేక్షకులకు మరోసారి యాక్షన్ హీరోగా కింగ్ నాగార్జున కనిపించనున్నారు.

ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ‘ది ఘోస్ట్’ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయని సెన్సార్ వాళ్లు బయటకు వెల్లడించినట్లు తెలుస్తుంది. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అందరినీ ఆకట్టుకుంటుందని, అలాగే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. మొత్తానికి నాగార్జున ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో సరి కొత్త ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. తనపైకి వచ్చిన గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్ గా ఉంది. ‘ది ఘోస్ట్’ సినిమాతో మన కింగ్ నాగార్జున హిట్టు కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Exit mobile version