Rangabali Trailer: సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడి నేపథ్యంలో తెరకెక్కిన కథ రంగబలి అని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగశౌర్య యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. పండగైనా, పాడైనా అంతా సొంతూరిలోనే అనుకునే ఓ కుర్రాడికి.. ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే ఈ చిత్రం ద్వారా చూపించారు దర్శకుడు పవన్ బసంశెట్టి.
కథ అదిరింది భయ్యా(Rangabali Trailer)
“ప్రతి మనిషి పేరు మీద సొంత పొలం ఉండకపోవొచ్చు. సొంత ఇల్లు ఉండకపోవొచ్చు. కానీ సొంత ఊరు మాత్రం ఉంటుంది..” “బయటి ఊర్లో బాసినసలా బతికినా తప్పు లేదు భయ్యా.. కానీ సొంతూర్లో మాత్రం సింహంలా ఉండాలి” అంటూ నాగశౌర్య చెప్పిన ఈ డైలాగుల్లోనే కథ మొత్తం చెప్పేశాడు డైరెక్టర్. ఇందులో నాగశౌర్య క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో సరదాగా తిరగడం, అమ్మాయిల వెంట పడడం… ఇలా సరదా సరదాగా హీరో కాలం గడిపిచేస్తుంటారు. దానికి తోడు సత్య క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు నవ్వులు పంచుతోంది.
ఇక ఆ తరవాత కథ సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. విలన్ రంగ ప్రవేశం.. రంగబలి సెంటర్ నేపథ్యం, అక్కడి రాజకీయంతో వాడీవేడీగా మారడం. యాక్షన్ సీన్లు ఇలా ఈ సినిమా ఆధ్యంతం ఆకట్టుకోనున్నట్టు తెలుస్తుంది.
కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీలో దసరా సినిమాలో విలన్ గా చేసిన ‘షైన్ టామ్ చాకో’ప్రతినాయకుడు పాత్రలో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జులై 7న ఆడియన్స్ ముందుకు రానుంది.