Site icon Prime9

God Father: ‘పూరీ‘ పై ఫస్ట్ షాట్ తీయగానే ఆశ్చర్యపోయారు.. మెగాస్టార్ చిరంజీవి

puri

puri

Tollywood: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కీలక పాత్ర పోషించారు. మొదట్లో దీన్ని చేయడానికి ఇష్టపడకపోయినా చిరు కోసమే చేశారు. తన ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో, ఈ సినిమాలో నటించడానికి పూరి విముఖత చూపాడంటూ చిరు చెప్పారు. షూట్ రోజున అందరూ ఎదురుచూస్తుంటే పూరీ తన కారవాన్ నుంచి బయటకు రావడం లేదని అన్నారు

మేమంతా అతని కోసం లొకేషన్‌లో ఎదురు చూస్తున్నాము. కానీ అతను కారవాన్ నుండి బయటకు రావడం లేదు. చివరగా సిగరెట్ తాగుతూ, టీ తాగుతూ తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో కారవాన్ నుంచి బయటకు వచ్చాడు అని చిరు అన్నారు. అతనితో పాటు ఛార్మీ కూడా వచ్చింది. కారవాన్ నుంచి బయటకు రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని చార్మీని అడిగాను. అతను వణుకుతున్నాడని, షూట్ చేయడం అస్సలు ఇష్టం లేదని ఆమె నాకు చెప్పింది. అయితే ఎట్టకేలకు ఫస్ట్ షాట్ తీయగానే తన సహజమైన నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. అతను తన పాత్రకు 100 శాతం న్యాయం చేసాడని చిరంజీవి ఆ ఇంటర్యూలో చెప్పారు. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version