Site icon Prime9

Icon Star Allu Arjun: బన్నీకి బర్త్ డే విషెష్ వెల్లువ.. పుష్ప-2 ఫస్ట్ లుక్ రాక్స్ అంటున్న చిరంజీవి

icon Star Allu Arjun

icon Star Allu Arjun

Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ అభిమానులు ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ నిన్నటి నుంచే మొదలయ్యాయి. బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఆయన తాజా చిత్రం పుష్ప-2 నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్టు ఇచ్చారు మేకర్స్. ఒక మూడు నిమిషాల 17 సెకన్ల నిడివి గల ఈ వీడియోతో సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేశారు చిత్ర బృందం. ఇక ఈ టీజర్ తో పాటు రిలీజ్ అయిన పోస్టర్ అయితే ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అల్లు అర్జున్ ఉగ్రరూప గంగమ్మ అవతారంలో కనిపించి అదరగొట్టాడు.

బన్నీని బర్త్ డే విషెష్(Icon Star Allu Arjun)

పట్టుచీర కట్టుకొని, చేతికి గాజులు, ఒంటి నిండా నగలు నిమ్మకాయలు, పూల దండలతో ఉగ్రరూపంలో కొలువైన అమ్మవారి అవతారంలో చేతిలో గన్ పట్టుకొని ఉన్న అల్లు అర్జున్ లుక్ చూసి ఇటు ఫ్యాన్స్, అటు సెలబ్రేటిస్ సైతం ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. సినిమాపై తనకి ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ బన్నీపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే తనకి బర్త్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే తన మేనమామ మరియు బన్నీ ఇన్స్పిరేషన్ పర్సన్ అయిన మెగాస్టార్ చిరంజీవి కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే బన్నీ. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని చేసుకోవాలి అంటూ విష్ చేస్తూ.. ఇక పుష్పలోని నీ ఫస్ట్ లుక్ అయితే రాక్స్ అంటూ ట్వీట్ చేశాడు.

 

అలాగే టాలీవుడు సెలబ్రిటీలు అయిన సాయి ధరమ్ తేజ్, నిఖిల్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, డైరెక్టర్లు సురేంద్ర రెడ్డి మరియు గోపీచంద్ మలినేనితో పాటు మరికొందరు కూడా బన్నీకి బర్త్ డే విషెస్ తెలియజేశారు.

Exit mobile version