‘Bro’ Trailer: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా నటించిన బ్రో ట్రైలర్ విడుదలైంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదయ సీతమ్‌కి రీమేక్. ట్రైలర్ అసలైన దానికి నిజం. సమయం గురించి ఆందోళన చెందుతున్న పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తారు.
ఎంటర్ టైనర్ గా.. (‘Bro’ Trailer)
భస్మాసురుడు అని ఒకడుండేవాడు తెలుసా.. మీ మనుషూలంతా వాడి జాతే. మీ తలపై మీరే పెట్టుకుంటారు. ఇంకెవ్వరికి ఛాన్స్ ఇవ్వరు అంటూ పవన్ కళ్యాణ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సమయం లేదంటూ సాయి ధరమ్ తేజ్ హడావుడిగా తయారయి ఆఫీసుకు వెళ్లే సీన్లు కనిపిస్తాయి. సాయి ధరమ్ తేజ్ కు మరణం సంభవించి పవన్ దేవుడిగా వస్తారు. నీ దగ్గర ఎప్పుడూ లేదు లేదు అంటుంటావే అదే నేను టైం అంటూ పవన్ చెప్పడం కనిపిస్తుంది. ఎప్పుడూ నీతోనే ఉంటాడు. బ్లాక్ మెయిలా అంటూ తనికెళ్ల భరణి సాయి ధరమ్ తేజ్ ను అడగడం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన దైన టైమింగ్ తో సులువుగా చెప్పే డైలాగులు అలరిస్తాయి. అదేవిధంగా జీవితం, సమయం మధ్య బేలన్స్ పాటించాడనికి ఇబ్బంది పడే వ్యక్తిగా సాయి ధరమ్ తేజ్ తన దైన శైలిలో నటించారు. . చచ్చి బతికిపోయానన్నమాట.. అనవసరంగా బతికి చచ్చా అంటూ తేజ్ చెప్పే డైలాగ్ కూడా ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. మొత్తంమీద జీవితం, సమయం, చావు బతుకుల అంశాన్ని సముద్రఖని వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.
మెగా అభిమానులను ఆకట్టుకునే అంశాలన్నింటిపైనా శ్రద్ద చూపుతూనే దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని క్లారిటీగా చెప్పినట్లు కనిపిస్తోంది. పవన్ కాస్ట్యూమ్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, త్రివిక్రమ్ డైలాగులు అభిమానులను ఖచ్చితంగా అలరిస్తాయి. ఈ చిత్రం జూలై 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.