Site icon Prime9

Masooda Movie: ‘మసూద’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

masooda prime9news

masooda prime9news

Tollywood: చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ ప్రేక్షకులను పరిచయమైన కావ్య, హీరోయిన్ గా అడుగు పెట్టబోతుంది. తిరువీర్ హీరోగా నటించిన సినిమా ‘మసూద’. ఈ సినిమా హార్రర్‌ డ్రామా బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామని ఈ మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించగా, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాహుల్ యాదవ్ నక్క నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బ్యానర్‌లో ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ సినిమాల తరువాత ఇప్పుడు ‘మసూద’ సినిమాతో మీ ముందుకు వస్తున్నామన్నారు. మళ్లీ రావా సినిమా ఒక లవ్ స్టోరీ అని, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ అని, ఇప్పుడు రాబోతున్న సినిమా హార్రర్ డ్రామా సినిమా అని, మనమందరం ఒక మంచి హార్రర్ డ్రామాను చూసి చాలా కాలమైందన్నారు. మంచి హార్రర్ సినిమాల్లో మా “మసూద ” సినిమా ఒకటిగా నిలుస్తుందని, మాకు గట్టి నమ్మకముందని తెలిపారు. ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత ముఖ్యమైన పాత్రలో నటించగా, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సూర్యారావు తదితర నటీనటులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి స్వరాలను అందించారు.

Exit mobile version
Skip to toolbar