Site icon Prime9

Masooda: నవంబర్ 18న రిలీజ్ అవుతున్న ‘మసూద’

Masooda

Masooda

Tollywood: ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. ఈచిత్రం నవంబర్ 18న విడుదలవుతోంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. కొత్త నిర్మాత. ‘మళ్లీరావా’తో గౌతమ్‌ని పరిచయం చేశాడు. తర్వాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో స్వరూప్‌ని డైరెక్టర్‌గా, నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచయం చేశాడు. నవీన్‌కి ఆ సినిమా ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. ఆ రెండు సినిమాలకు నేను అభిమానిని. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి, అప్పుడే రాహుల్‌కి మాటిచ్చాను. తర్వాత ఏదైనా సినిమా ఉంటే, నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పానని అన్నారు.

చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ ముందుగా దిల్ రాజుగారికి థ్యాంక్స్. రాజుగారిది చాలా మంచి చెయ్యి, నాది కూడా మంచి చెయ్యి, రెండు మంచి చేతులు కలిస్తే గట్టిగా సౌండ్ వస్తుందని భావిస్తున్నాను. ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలు మా ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మసూద విషయానికి వస్తే, 3 సంవత్సరాల కష్టమిది. మధ్యలో కోవిడ్ రావడంతో ఆలస్యమైంది. మొదటి నుంచి నేను చెబుతున్నట్లుగా, కొత్త డైరెక్టర్స్‌ని 5గురుని పరిచయం చేస్తున్న తరుణంలో ఇప్పుడు 3వ దర్శకుడు సాయికిరణ్‌ని పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.

Exit mobile version