Site icon Prime9

న‌వీన్ చంద్ర‌, క‌ల‌ర్ స్వాతిల “మంత్ ఆఫ్ మ‌ధు”.. ఆకట్టుకుంటోన్న టీజర్

manth of madhu teaser

manth of madhu teaser

Naveen Chandra: వైవిధ్యమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కైవసం చేసుకున్న హీరో నవీన్ చంద్ర. ఈ నటుడు తాజాగా నటిస్తున్న మూవీ మంత్ ఆఫ్ మధు. ఈ సినిమాలో కలర్స్ స్వామి హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ నాగోటి దర్శ‌క‌త్వంలో క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ‘మంత్ ఆఫ్ మ‌ధు’ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూవీ నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.

మాన‌వ సంబంధాలు, జనం ఓ విష‌యాన్ని ఏ కోణంలో చూస్తున్నార‌నే దానిపైనే ‘మంత్ ఆఫ్ మ‌ధు’ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తే
అర్థ‌మ‌వుతుంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో గృహిణి పాత్ర‌లో న‌టించింది. విప‌రీత‌మైన భావోద్వేగాలున్న తాగుబోతు భ‌ర్త పాత్ర‌లో న‌వీన్ చంద్ర నటించారు. శ్రేయా న‌వేలీ, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఇదీ చదవండి: అనుష్క పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా..?

Exit mobile version