Site icon Prime9

Mahesh Babu: మహేష్ కొత్త లుక్ అదిరింది..!

mahesh new look for ssmb28

mahesh new look for ssmb28

Mahesh Babu: త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌హేష్‌బాబు కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రం కోసం మ‌హేష్ బాబు మేకోవ‌ర్ అవుతున్న ఫొటోను స్టైలిస్ట్ అలీమ్ హ‌కీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన శైలి ఫ‌న్ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు యాక్ష‌న్‌ను జోడించి త్రివిక్ర‌మ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా కోసం మహేష్ స్టైలిష్‌గా మేకోవ‌ర్ అవుతున్నాడు. గ‌త నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. అయితే ఇటీవల మహేష్ తల్లి ఇందిరాదేవి మరణంతో కొద్ది రోజులు షూటింగ్కు గ్యాప్ ఇచ్చారు. కాగా త్వ‌ర‌లోనే తిరిగి ఈ సినిమా సెట్పైకి రానుంది. ఈ సెకండ్ షెడ్యూల్‌ షూట్లో పాల్గొనేందుకు మ‌హేష్‌బాబు రెడీ అవుతున్నాడు. లైట్ బియ‌ర్డ్‌, క‌ర్లీ హెయిర్ స్టైల్‌తో డిఫ‌రెంట్ లుక్‌లో మ‌హేష్‌బాబు క‌నిపిస్తున్న ఫొటోను హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హ‌కీమ్ గురువారం ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. దీనితో మ‌హేష్ ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. మ‌హేష్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో మ‌హేష్‌బాబుకు జోడీగా పూజాహెగ్డే న‌టిస్తోంది.

ఇదీ చదవండి: మీ కోసం ఇంకో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నాను.. మెగాస్టార్ తో పూరి జగన్నాధ్

Exit mobile version