Site icon Prime9

Leo First Look: లియో ఫస్ట్ లుక్.. మునుపెన్నడూ చూడని విధంగా దళపతి విజయ్ విశ్వరూపం

Leo First Look

Leo First Look

Leo First Look: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుస పెట్టి హిట్స్ కొడుతూ ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. లియో సినిమాలో విజయ్ సరసన త్రిష, గౌతమ్ మీనన్, సంజయ్ దత్ వంటి పలువురు స్టార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే తాజాగా నేడు(జూన్ 22) దళపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లియో నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. దీనితో ఇప్పుడు నెట్టింట లియో ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే ఇందులో విజయ్ సుత్తి పట్టుకొని విలన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. విజయ్ ని దర్శకుడు లోకేష్ ఈ మూవీలో చాలా పవర్ ఫుల్ గా చూపించనున్నట్టు కనిపిస్తుంది. ఇక విజయ్ పక్కన తోడేలు అరుస్తూ చాలా భీకరంగా కూడా కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక లియో ఫస్ట్ లుక్ ఇంత మాస్ గా ఉండటంతో ఈ మూవీపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

విజయ్ నెక్ట్స్ మూవీ(Leo First Look)

ఇకపోతే ఈ సందర్భంగానే విజయ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాను నటిస్తోన్న నెక్ట్స్ సినిమా గురించి వెల్లడించారు. తెలుగులో ఇటీవల కాలంలో నాగ చైతన్యతో కస్టడీ సినిమా తీసిన వెంకట్ ప్రభుతో తాను కొత్త మూవీ చేయనున్నట్టు ప్రకటించాడు విజయ్. ఈ సినిమాను ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్​పై కళపతి ఎస్‌. అఘోరం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం విజయ్​కు ఏకంగా రూ.200కోట్ల రెమ్యునరేషన్​ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా విజయ్ సినిమాల నుంచి వరుస అప్టేడ్స్ రావడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version