Site icon Prime9

Krithi Shetty: శర్వానంద్ తో జతకడుతున్న కృతి శెట్టి

krithy-shetty

Tollywood: తన తొలి చిత్రం ఉప్పెనతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న కృతి శెట్టి ’ది వారియర్‘ మరియు ’మాచర్ల నియోజకవర్గం‘ తో ప్లాప్ లు చూసింది. దీనితో తరువాత తన కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించలేదు. అంతేకాదు చాలా జాగ్రత్తగా ప్రాజెక్టుల పై సంతకం చేస్తానని చెప్పింది.

తాజా సమాచారం ప్రకారం శమంతకమణి ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్‌కి ఆమె సంతకం చేసింది. ఆమె యంగ్ హీరో శర్వానంద్‌కి జోడీగా కనిపించబోతోంది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుందని కూడా అంటున్నారు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు గోప్యంగా ఉంచారు. మరి కొద్దిరోజుల్లో మిగిలిన విషయాలను వెల్లడించే అవకాశముంది.

Exit mobile version
Skip to toolbar