Site icon Prime9

Krithi Shetty: కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ ఎందుకంటే ?

krithi-shetty

Tollywood: ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమా తర్వాత ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్టుగా నిలవగా, బంగార్రాజు సినిమా యావరేజ్ గా నిలిచింది. అలా ఆమెకు మొదటి మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన మూడు సినిమాలు ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ రావడంతో డిజాస్టర్లుగా నిలిచాయి.

కృతి శెట్టి రీసెంటు నటించిన సినిమాలు మూడు. రామ్ సరసన ది వారియర్ సినిమా, నితిన్ సరసన మాచర్ల నియోజక వర్గం సినిమా, సుధీర్ బాబు సరసదా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటించింది. ది వారియర్ సినిమాలో విజిల్ మహాలక్ష్మి అనే పాత్రలో దర్శనమిచ్చింది. కానీ ఈ సినిమా రామ్ కెరియర్లో ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక మొన్న విడుదల ఐనా సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఓ హిట్ అయ్యే అవకశాలు కపించడం లేదు. ఈ సినిమా హిట్ అవ్వకపోతే మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నట్టే.

ఇప్పటికైనా మంచి కథలు ఎంచుకోవాలని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలని, కొన్నాళ్ళు రెమ్యూనరేషన్ పక్కనపెట్టి సినిమాలు చెయ్యాలని, లేదంటే మరికొన్ని సినిమాలు చేసి, ఇక ఇంటికి బ్యాగ్ సర్దుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version