Site icon Prime9

Keerthy Suresh: ఎన్టీఆర్ సరసన నటించబోతున్న కీర్తి సురేష్‌

keerthy suresh 2 prime9news

keerthy suresh 2 prime9news

Tollywood: కీర్తి సురేష్‌ ‘మహానటి’ సినిమాతో తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిన విషయమే. సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాకు ఉత్తమ నటిగా ఎంపికై నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. రీసెంట్ గా ఈమే నటించిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం కీర్తి సురేష్‌ భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుండగా, ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా మన ముందుకు వస్తుంది. భోళా శంకర్ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రాఖీ పండుగ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ ను మరియు సినిమా టైటిల్‌లు రీవిల్ చేసింది.

కొరటాల శివ డైరక్షన్లో ఎన్టీఆర్ సరసన మెయిన్ లీడ్‌లో కీర్తి సురేష్ నటిస్తున్నారని తెలిసిన సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆలియా, కియార అద్వానీ పేర్లు వినిపించాయి. కాని వీళ్ళను ఫైనల్ చెయ్యలేదు. ఈ సినిమాలో కియారాను కూడా ఒక హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు చిత్ర బృందం సిద్దంమవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇంకో ముఖ్య పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ కథలో కీర్తి సురేష్ ను ఓకే చెప్పినట్టు తెలిసింది. ఎన్టీఆర్ సరసన అనగానే కీర్తి సురేష్ వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసిన సమాచారం. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రనే హైలెట్ అని టాలీవుడ్ వర్గాల వారి సమాచారం.

Exit mobile version