Site icon Prime9

Ram Gopal Varma: కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్.. రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma

Ram Gopal Varma

Tollywood: వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ. తాజాగా టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా ఓ ట్వీట్ చేశారు. కేసీఆర్ తర్వలోనే జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపధ్యంలో వర్మ సినిమా నటుల్లా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని ట్వీట్ చేశారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగుజాడలను అనుసరించి, టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్‌గా పాన్ ఇండియాగా వెళ్తుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యాష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ లాగా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని వర్మ పేర్కొన్నారు. శుభకాంక్షలు చెబుతున్నట్టుగా ఓ ఫ్లవర్ ఎమోజీని కూడా ట్వీట్‌లో ఉంచారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదట దసరాకు జాతీయపార్టీ ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ కొత్త పార్టీ అధికారికంగా ప్రారంభించబడుతుందని తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ప్రతిరోజూ వివిధ రంగాల నిపుణులను కలుస్తున్నారు. కొత్త పార్టీ మేనిఫెస్టోకు రంగం సిద్దం చేస్తున్నారు.

 

Exit mobile version