Site icon Prime9

Kamal Haasan: సిని ఇండస్ట్రీలో వారిద్దరు స్టైలే వేరు.. 35 ఏళ్ల తర్వాత వారి కాంబినేషన్ లో ఓ సినిమా.. ఎవరంటే?

Both of them have different styles in the cine industry. After 35 years, a movie will be made in their combination.

Tollywood: సినిమా ఇండస్ట్రీలో వారిద్దరి ప్రతిభ, ప్రేక్షకుల్లో కేక పెట్టించింది. విలక్షణమైన నటనలతో సొంతం చేసుకొన్నవారు ఒకరైతే, విమర్శకులను సైతం మెప్పించే డైరెక్షన్ కల్గిన చాతుర్యం మరొకరిది. వారే దక్షిణధి సినీ ఇండస్ట్రీలో ప్రముఖులైన నటుడు కమల్ హసన్-దర్శకేంద్రుడు మణిరత్నం. వీరిద్దరూ కలయుకతో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుంది. అది కూడా 35ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ కుదరడంతో సిని ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.

యూనివర్శల్ హీరో కమల్ హాసన్ తన కెరీర్ లో 230కి పైగా సినిమాలు చేశారు. ఇటీవల ఆయన నటించిన ‘విక్రమ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కమల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్2’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇంతలో మరో సినిమా ఒప్పుకున్నారు.

లెజండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఓ సినిమాను తెరపైకెక్కించే పనిలో కమల్ హసన్ ఉన్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. గతంలో వీరిద్దరి కాంభినేషన్ లో ‘నాయకన్’ అనే సినిమాను 1987లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకొనింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. తెలుగులో ‘నాయకుడు’ అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

దాదాపు 35 ఏళ్ల తరువాత మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కమల్ హాసన్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం ఉండనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తలపెట్టిన ఈ మూవీ కమల్ హసన్ కు 234వ సినిమా గా తెలుస్తుంది. 2024లో విడుదల చేసేందుకు సమాయత్తమౌతున్నారు.

ఇది కూడా చదవండి: Allur Sirish: సహజీవనం.. ఆపై పెండ్లి బహు భేష్.. నటుడు అల్లు శిరీష్

Exit mobile version