Project-K: ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్-కే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వచ్చేశాయ్. అమెరికాలో జరుగుతోన్న శాన్‌డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్‌లో దీనికి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలె ఈ సినిమా నుంచి విడుదలైన డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్‌లుక్‌పై వచ్చిన విమర్శలను తిప్పిగొట్టేలా తాజాగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ చూస్తుంటే మాత్రం తెలుగు సినిమాను నాగ్ అశ్విన్ హాలీవుడ్ లెవెల్లో తీసుకుళ్తున్నాడని పక్కాగా తెలుస్తుంది. కాగా ఇప్పుటి వరకు What Is Project-K అనే సస్పెన్ష్ బ్రేక్ ఇస్తూ ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు చిత్ర బృందం. ప్రపంచాన్ని చీకటి శక్తి కమ్మేసినప్పుడు కారుమేఘాలను చీల్చుతూ ఓ వెలుతురు ఉద్భవిస్తుంది. అప్పుడు చీకటి అంతం ఆరంభమవుతుంది’ అనే డైలాగ్‌తో మొదలైన గ్లింప్స్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించిందనే చెప్పాలి. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కానీ గ్రాఫిక్స్ విజువల్స్ కానీ అదిరిపోయాయి. ఈ సినిమాలో సూపర్ హీరోగా ప్రభాస్ ఎంట్రీ లుక్ నెక్ట్స్ లెవెల్. ఈ గ్లింప్స్ లో ‘వాటీజ్ ప్రాజెక్ట్- కె’ అనే డైలాగ్‌తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. ఇక దీపికా పదుకొణె క్యారెక్టర్‌ని కూడా ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. అలాగే తమిళ నటుడు పశుపతి ఇందులో ఓ కీలక రోల్ చేశారనిపిస్తుంది. ఇకపోతే మహానటి తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై యావత్ సినీ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
ఏం విజన్ గురూ.. గట్టిగానే ప్లాన్ చేశారు(Project-K)
గ్లింప్స్ ద్వారా ఈ సినిమా కథపై దర్శకుడు చెప్పకనే చెప్పినట్టు ఓ హింట్ ఇచ్చేశారు. కల్కి అనే పేరు మనకు తెలిసిందే. కలిగియుగంలో పాపం పెరిగిపోయినప్పుడు దైవాంశసంభూతిడిగా కల్కి అవతరిస్తాడని.. దుష్ట సంహారం చేసి జనాల్ని కాపాడుతాడనేది పురాణం. కాబట్టి ఈ సినిమాలో హీరో ప్రభాస్ పాత్ర అదే విధంగా ఉంటుందని మనకు అర్థం అవుతుంది. ఈ కథ విషయానికి వస్తే 2898 ADలో మొదలవుతుంది. అంటే ఈ కాలానికి సరిగ్గా ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఈ కథ జరిగినట్టు చెప్పుకొచ్చారు. అప్పట్లో దుష్టుల వలన మానవులు నానా హింసకు గురవుతున్నప్పుడు, ప్రజల్లో జీవనం మీద ఆశలు నశించినప్పుడు కల్కి రంగంలోకి దిగుతాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడనేది ప్రధాన కాన్సెప్ట్ ఈ కథ రూపొందనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కేవలం భూత(గడిచిన)కాలంలోనే కాకుండా భవిష్యత్ కాలంలోనూ నడువనున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్-భూత కాలాల మధ్య ఈ కథను గట్టిగానే ప్లాన్ చేసి ఎంతో అద్భుతమైన కనెక్షన్లతో తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. ఈ గ్లింప్స్ లో పీరియాడిక్ స్టోరీతో పాటు ఫ్యూచర్ కి సంబంధించిన నేపథ్యం అంటే మోడరన్ వరల్డ్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. భవిష్యత్తులోనూ కూడా ప్రభాస్ శత్రువులతో యుద్ధం చేసి ప్రజల్ని కాపాడుతాడని అర్థం అవుతుంది.
కాగా ఈ ప్రతిష్ఠాత్మక కామిక్ కాన్ ఈవెంట్‌లో రిలీజైన తొలి ఇండియన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులకెక్కింది. హీరో ప్రభాస్, కమల్ హాసన్, రానా దగ్గుబాటి తదితరులు ఈ ఈ వెంట్లో పాల్గొని సందడి చేశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ 500కోట్ల భారీ వ్యవయంతో కల్కి 2898 ఏడీ మూవీని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రజల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజైన గ్లింప్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.