Site icon Prime9

SDT 15 : మెగా హీరో మూవీకి సపోర్ట్ గా యంగ్ టైగర్… దోస్తీని కంటిన్యూ చేస్తున్నారా ?

junior-ntr-voice-over-for-sai-dharam-tej-15th-movie

junior-ntr-voice-over-for-sai-dharam-tej-15th-movie

Tollywood News: తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి, మెగా ఫ్యామిలీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ దూసుకుపోతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నారు. సీనియర్ హీరోలు అయిన చిరు, బాలయ్యలు ఇప్పటికీ తమ సినిమాలతో పోటీపడుతూనే ఉంటారు. ఇక యంగ్ హీరోలు తారక్, చరణ్ గతంలో తమ మూవీస్ తో పోటీపడినప్పటికీ ఇటీవల వచ్చిన ” ఆర్ఆర్ఆర్ ” లో కలిసి నటించి దేశ వ్యాప్తంగా ట్రెండ్ సృష్టించారని చెప్పొచ్చు. సాధారణంగా పర్సనల్ గా వీరి మధ్య మంచి స్నేహబంధం ఉందని పలు సందర్భాల్లో వ్యక్తమవుతూనే ఉన్నా… వారి అభిమానుల మధ్య మాత్రం పోటీ ఉంటూనే ఉంది.

ఈ తరుణం లోనే మరోమారు ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ని రుజువు చేస్తున్నారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ గురించి కొత్తగా పరిచయం చేయాలిసన అవసరం లేదు. వరుస సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో బైక్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సాయి మళ్ళీ మూవీస్ తో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎస్ డీ టి 15 అనే వర్కింగ్ టైటిల్‏తో సాయి హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియోకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించనున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇందుకు గాను తారక్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అలానే ఈ టైటిల్ గ్లింప్స్ డిసెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా సాయి కూడా ఎన్టీఆర్ కి థాంక్యూ చెబుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

Exit mobile version