Site icon Prime9

Jr NTR: ఎన్టీఆర్ నయా లుక్.. సూపర్ ట్రెండీ గురూ..!

jr ntr latest trendy look goes viral

jr ntr latest trendy look goes viral

Jr NTR: మెన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఖండాంతరాలు దాటి దేశవిదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర అపూర్వ విజయంతో ఉత్సాహంగా ఉన్నాడు ఈ టాలీవుడ్ స్టార్ హిరో. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ ముమ్మరంగా జరుగుతున్నాయి. తర్వరలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.

ఇకపోతే ఈ మూవీలో ఎన్టీఆర్‌ సరికొత్త లుక్స్‌తో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. అందుకు తగినట్లుగానే శుక్రవారం హెయిర్‌ స్టెలిష్ట్‌ ఆలీమ్‌ హకీమ్‌ తన సోషల్‌మీడియా ఖాతాలో ఎన్టీఆర్‌ మేకోవర్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో కొంచెం గడ్డంతో స్ట్రెయిట్ హెయిర్ స్టైల్ తో ఎన్టీఆర్ మంచి ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సరికొత్త లుక్ ఎన్టీఆర్‌కు బాగా సూటయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: తొలి దక్షిణాది హీరోగా బన్నీ అరుదైన ఘనత.. అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఖుషీ

Exit mobile version