Site icon Prime9

Jr NTR: ఎల్లలు దాటిన అభిమానం ఎన్టీఆర్ సొంతం.. “ఇదీ మా హీరో అంటే” అంటూ ఫొటోస్ వైరల్

jr ntr craze in japan

jr ntr craze in japan

Tollywood: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విదేశాల్లోనూ సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈనెల 21 జపాన్ ప్రేక్షకుల కోరిక మేరకు అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం చిత్రబృందం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళి, ఎన్టీఆర్ కుటుంబం అయిన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ మరియు రామ్ చరణ్, ఉపాసన తదితరులు ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్కు జపాన్లోనూ ఫ్యాన్స్ కొదవలేదని పిస్తుంది. ఎన్టీఆర్పై అక్కడి ప్రజలు ఎల్లలుదాటిన అభిమానాన్ని కనపరిచారు దానితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇప్పుడు మరో లేటెస్ట్ అండ్ క్రేజీ అప్ డేట్ తో ‘ఇదీ మా హీరో అంటే’ అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీం జపాన్ రాజధాని టోక్యోలో పాపులర్ లగ్జీరియస్ హోటల్ అయిన ది రిట్జ్ కార్ల్టన్ లో బస చేశారు. అక్కడి హౌస్ కీపింగ్ సిబ్బంది అంతా తారక్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ అంట. ఎన్టీఆర్ ని చూడగానే వారు చాలా సర్ప్రైజింగ్ గా ఫీలయ్యారు. ఫొటోలు దిగుతూ తెగ ఎగ్జైట్ అయ్యారు. తారక్ మీద తమకున్న అభిమానాన్ని లెటర్స్, గ్రీటింగ్ కార్డుల ద్వారా చాటుకున్నారు. ఇంక అక్కడి వారితో మాట్లాడుతూ, తన మీద వారు చూపిస్తున్న అభిమానం మరియు వారు రాసిన గ్రీటింగ్ కార్డ్స్ ని చూస్తూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. హౌస్ కీపింగ్ టీం తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు యంగ్ టైగర్ ఏం మాట్లాడాలో తెలియక ఎమోషనల్ అవుతూ  వారందరికీ థ్యాంక్స్ తెలియజేశాడు.

ఇదీ చదవండి “ప్రిన్స్” హీరోయిన్ “మరియా” గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

Exit mobile version