Site icon Prime9

Prakash Raj: రంగమార్తాండ మూవీలో నన్ను కొత్తగా చూస్తారు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్

I will be seen a new in Rangamarthanda movie..Prakash Raj

Tollywood: మరాఠీలో విడుదలైన నటసామ్రాట్ సినిమా రీమేక్ లో, క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో నన్ను సరికొత్తగా చూస్తారని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొనింది. అయితే దీపావళికి విడుదల చేస్తామని పేర్కొన్నప్పటికీ విడుదలపై ఇంకా సరైన క్లారిటీ చిత్ర నిర్మాత దగ్గర నుండి రాలేకపోవడంతో ప్రేక్షకుల్లో అసహనం పెరుగుతోంది. అగ్ర నటి రమ్యకృష్ణ, నవ్వుల రాజ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌ వంటి ప్రదాన తారాగణంతో సినిమాను తెరపైకెక్కించారు.

ఈ సినిమా గురించి ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ, రంగమార్తాండకు తానే దర్శకత్వం వహించాలని అనుకున్నానని, అయితే డైరెక్టర్‌గా కృష్ణవంశీ ఈ కథకు సరైన న్యాయం చేస్తాడని భావించానన్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. యాక్టింగ్‌, పర్‌ఫార్మెన్స్ పరంగా నన్ను కొత్త యాంగిల్ లో చూస్తారని ఆయన అన్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇళయరాజా మ్యూజిక్ సిట్టింగ్స్‌, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్‌ డబ్బింగ్‌ వీడియోలు, స్టిల్స్‌ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తున్నాయి. ఎమోషనల్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్‌ మూవీస్‌-రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Sandhya will be impressive in character: సంధ్య క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా – “నచ్చింది గాళ్ ఫ్రెండూ” హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్

November 8, 2022
Exit mobile version