Site icon Prime9

Action King Arjun: విశ్వక్ సేన్ వల్ల హర్ట్ అయ్యాను.. కంప్లైంట్ చేస్తాను.. యాక్షన్ కింగ్ అర్జున్

Action King Arjun

Action King Arjun

Tollywood: నటుడు విశ్వక్ సేన్ తనను, తన చిత్ర బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టారని యాక్షన్ కింగ్ అర్జున్ పేర్కొన్నారు. ఆయన దర్వకత్వం వహిస్తున్న సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని వచ్చిన వార్తల నేపధ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విశ్వక్ ఎపుడూ చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాలేదన్నారు. ఆయన ప్రవర్తన వల్ల రెండు సార్లు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశామన్నారు. కధ చెప్పిన తరువాత విశ్వక్ సేన్ తన రెమ్యూనరేషన్ చెప్పారని, తాను అంత ఇవ్వలేనని చెప్పానని అర్జున్ తెలిపారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని, ఓ ఏరియా రైట్స్ ఇవ్వమని అడిగితే సరే అన్నానని, కొంత అడ్వాన్స్ ఇచ్చానని ఆయన వివరించారు.

ఆ తర్వాత స్టోరీ డిస్కషన్స్ కోసం ఎన్ని ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్‌ని పంపిద్దామని ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. తన జీవితంలో అన్ని కాల్స్ ఎవరికీ చేయలేదన్నారు. ఈ రోజు టాలీవుడ్ దేశంలో సంచలనాలు సృష్టించే సినిమాలు రూపొందిస్తోందని అర్జున్ అన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి నటులు ఎంతో డెడికేషన్ గా ఉండటం మనం చూస్తున్నామని అన్నారు. అయితే విశ్వక్ సేన్‌కు ప్రొఫెషనలిజం లేదని, దర్శక, నిర్మాతలు అంటే అసలు గౌరవం లేదన్నారు. తానొక దర్శకుడిగా, నిర్మాతగా హర్ట్ అయ్యానని చెప్పారు.

ఒకసారి విదేశాలు వెళ్లి వచ్చానని, స్కిన్ ట్యాన్ అవ్వడం వల్ల కొంత రెస్ట్ తీసుకుని ఫ్రెష్‌గా సెట్‌కు వస్తానంటే ఓకే అన్నామని, షెడ్యూల్ క్యాన్సిల్ చేశానని అర్జున్ చెప్పారు. ఆ తర్వాత మరోసారి కొత్త షెడ్యూల్ వేస్తే, తెల్లవారితే షూటింగ్ అనగా, ఉదయం నాలుగు గంటలకు క్యాన్సిల్ చేయమని విశ్వక్ సేన్ నుంచి మెసేజ్ వచ్చిందని ఆయన తెలిపారు. వర్క్ పట్ల విశ్వక్ సేన్‌కు కమిట్మెంట్ లేదని ఎప్పటికీ అతనితో సినిమా చేయనని అన్నారు. తనకు జరిగినట్టు మరొకరికి జరగకూడదని కోరుకుంటున్నట్టు చెప్పిన అర్జున్ దీనిపై ప్రొడ్యూసర్స్ గిల్డ్, నిర్మాతల మండలిలో విశ్వక్ గురించి కంప్లయింట్ చేస్తున్నామని స్పష్టం చేసారు.

Exit mobile version