Site icon Prime9

Jr NTR: నటుడిగా నేను చాలా నేర్చుకున్నాను.. ఎన్టీఆర్

jr ntr prime9news

jr ntr prime9news

Brahmastra Movie Press Meet: “బ్రహ్మాస్త్రం” సినిమా ప్రెస్ మీట్ నిన్న హైద్రాబాద్ లో జరిగినది. ఈ ప్రెస్ ఈవెంటుకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నాగార్జున, రాజమౌళి,రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ నటీనటులు పాల్గొన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ రాజమౌళిగారు “బ్రహ్మాస్త్రం” సినిమాను తెలుగులో సమర్పణ చేస్తారని అసలు అనుకోలేదని ఆయనకు కథ నచ్చడంతో ఈ సినిమాలో భాగమయ్యారని, రాజమౌళిగారు ఒక్కో సినిమాని మూడేళ్లు సానపెడుతూనే ఉంటారు అలాగే “బ్రహ్మాస్త్రం” సినిమాను కూడా మూడేళ్లు సానపెట్టి ఇప్పుడు వేటకు సిద్దమయ్యారని’ తెలిపారు.

రాజమౌళి మాట్లాడుతూ “బ్రహ్మాస్త్రం” ‘సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా చేయాలనుకుని అనుకున్నాం. కానీ ఐదు రోజుల ముందు మాత్రమే పోలీసుల నుంచి మాకు అనుమతి వచ్చిందని మళ్ళీ మద్యలో బుధవారం వినాయకుడు పండగ, శుక్రవారం నాటి నుంచి వినాయక నిమజ్జనాలు మొదలు అవ్వడంతో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్కు బందోబస్తు ఇవ్వడం చాలా కష్టమని పోలీస్‌ వారు చెప్పారు. దీంతో ఇక ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ రద్దు చేసి, ఇప్పుడు ఇక్కడ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నామనీ, “బ్రహ్మాస్త్రం” సినిమాలో మీరు కూడా భాగం కావాలని ఐదేళ్ల కిందటే ఈ విషయం గురించి కరణ్‌గారు నాకు చెప్పడంతో వెంటనే ఓకె చెప్పేసాను. ఆయాన్‌ ముఖర్జీ నాకు ఈ కథ చెప్పినప్పుడు నా చిన్ననాటి విషయాలు ఎన్నో గుర్తుకొచ్చాయని’ తెలిపారు.

ఎన్టిఆర్ మాట్లాడుతూ ” ప్రస్తుతం సినీ పరిశ్రమ చాలా సమస్యలని, అనేక ఒత్తిడిలను ఎదుర్కొంటుందని, అలాంటి సమయంలో సినీ పరిశ్రమ అన్నీ స్వీకరించాలని అభిమానుల కోసం గొప్ప సినీమాలు చేయాలని, ఇండియన్‌ సినీ పరిశ్రమలో చాలా మంది నటులున్నారు. కానీ వాళ్ళలో కొందరు మాత్రమే ప్రభావం చూపుతారు. అమితాబ్‌ బచ్చన్‌ గారు, రణ్‌బీర్‌ కపూర్‌ నటన అంటే నాకు చాలా ఇష్టమనీ వీళ్ళ నుంచి ఓ నటుడిగా నేను చాలా నేర్చుకున్నానని, రాజమౌళి, కరణ్‌ జోహార్‌ ఇద్దరూ ఇండియన్‌ సినీ పరిశ్రమను ఒక్కటిగా మార్చారని నేను నమ్ముతున్నానని ఇంక మా నాగ్ బాబాయ్‌ నటించిన హిందీ సినిమా ‘ఖుదాగవా’ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమా చూస్తూనే ఉంటానని ఎందుకంటే ఈ సినిమాలో ఒక తెలుగు హీరో హిందీలో కూడా డైలాగులు ఈ  విధంగా చెప్తారని ఆ సినిమా చూసే తెలుసుకున్నానని ” ఎన్టీఆర్ తెలిపారు.

Exit mobile version