Site icon Prime9

Puri Jagannadh: మీ కోసం ఇంకో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నాను.. మెగాస్టార్ తో పూరి జగన్నాధ్

Puri Jagannadh

Puri Jagannadh

Tollywood: గాడ్ ఫాదర్ సక్సెస్ ని మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో నటించారు. తాజాగా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మెగాస్టార్ చాలా కాలంగా వాయిదా పడిన వారి చిత్రం ‘ఆటో జానీ’ గురించి పూరిని ప్రశ్నించగా, దీనికి పూరి త్వరలోనే మరో స్క్రిప్ట్‌తో వచ్చి కలుస్తాను. ఆటో జానీని పక్కన పెట్టాను. మీ కోసం ఇంకో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నాను అని చెప్పారు. గాడ్ ఫాదర్ సినిమాలో పూరీకి అవకాశం ఇచ్చానని, తన వంతు కోసం ఎదురు చూస్తున్నానని మెగాస్టార్ అన్నారు.

గాడ్‌ఫాదర్ మరియు ఆటో జానీతో పాటు, చిరు మరియు పూరి తమ ఇటీవలి వైఫల్యాలైన లైగర్ మరియు ఆచార్య గురించి కూడా మాట్లాడారు. తాను బొంబాయిలో ఉంటున్నానని, ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్‌ పై పని చేస్తున్నానని పూరి చెప్పారు. ఫెయిల్యూర్‌ని ఎలా తీసుకుంటావు అని చిరు అడిగినపుడు పూరి సమాధానమిస్తూ, హీలింగ్ పీరియడ్ నెల కంటే ఎక్కువ ఉండదని తాను నమ్ముతానని చెప్పాడు. లైగర్‌ కోసం మూడేళ్లపాటు పని చేయడం తనకు ఆనందాన్ని కలిగించిందని, అయితే దాని వైఫల్యం వచ్చే మూడేళ్లపాటు తనను ఏడిపించలేదని పూరీ చెప్పాడు. బ్లాక్ బస్టర్ స్కోర్ చేసినప్పుడు ఎవరైనా మేధావిగా కనిపిస్తారని, అదే వ్యక్తి ఫెయిల్యూర్‌లో ఫూల్‌గా కనిపిస్తారని పూరి అన్నారు.

లైగర్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకున్న పూరి జిమ్‌కి వెళ్లి 100 స్క్వాట్‌లు చేశానని తెలిపారు. ఇదే విషయం పై చిరు స్పందిస్తూ, తన ఆచార్య వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ, మేలో కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లి రెట్టింపు శక్తితో వచ్చానని చెప్పారు. చిరు చివరి నిమిషం వరకు గాడ్ ఫాదర్ టీమ్ మరియు తాను సినిమా బాగు కోసం మార్పులు చేర్పులు చేశామని చెప్పారు. లైగర్ వైఫల్యాన్ని పూరి జగన్నాథ్ అంగీకరించడం ఇదే మొదటిసారి.

 

Exit mobile version