Site icon Prime9

HIT2 Trailer: ఆసక్తిరేపుతున్న హిట్ 2 ట్రైలర్

hit 2 movie review

hit 2 movie review

HIT2 Trailer: అడివి శేష్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్న సినిమా ‘హిట్ 2’. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

హైదరాబాదులోని ఆర్కే సినీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంటును ఘనంగా నిర్వహించారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సంజన అనే ఒక యువతి హత్య కేసును గురించి పోలీస్ ఆఫీసర్ గా హీరో విచారణ జరపడాన్ని చూపించారు. ‘మేజర్’ వంటి సూపర్ హిట్ తరువాత శేష్ చేసిన ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇదీ చదవండి: చైతూ 22వ సినిమా పేరు రివీల్.. పోస్టర్ రిలీజ్

Exit mobile version