Prime9

Nani’s Meet Cute: నాని ‘మీట్ క్యూట్’ సిరీస్​ ట్రైలర్​ రిలీజ్​.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు అంటే..?

Nani’s Meet Cute: నాచురల్ స్టార్ నాని వాళ్ల అక్క గంటా దీప్తి దర్శకురాలిగా రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఐదు కథల సమాహారంగా విడుదలకానున్న ఈ వెబ్ సిరీస్ ను హీరో నాని తన సొంత ప్రొడక్షన్ హౌజ్ వాల్ పోస్టర్ సినిమా సమర్పినలో సోని లివ్ లో ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. మొత్తం ఇది ఐదు ఎడిసోడ్స్ లో స్ట్రీమ్ అవనుంది. ఇందులో హీరోయిన్స్ అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, హీరోలు అశ్విన్ కుమార్, శివ కందుకూరి, సీనియర్ నటులు సత్యరాజ్, రోహిణి ముఖ్యపాత్రలు పోషించారు.

Meet Cute Trailer | Nani | Wall Poster Cinema | Sony LIV

ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సిరీస్ కు వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిచారు. కాగా ఈ సిరీస్ ట్రైలర్‌‌ తాజాగా విడుదలైంది. నాని వాయిస్ ఓవర్ తో.. ‘నీకు మీట్‌ క్యూట్‌ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు.. వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు, మాటలు, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ మొదలైన ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకునేలా ఉంది. విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇందులో ప్రతి కథకు ఒక ప్రాముఖ్యత ఉందని, ఈ తరం యువతకు తగ్గట్టుగా ఉంటుందని మీట్ క్యూట్ చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇదీ చదవండి: డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండి అంటున్న “నిక్కీ గల్రానీ”

Exit mobile version
Skip to toolbar