Site icon Prime9

Samantha: సమంత డెడికేషన్ కు హ్యట్సాఫ్.. “యశోద” చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

Hats off to Samantha's dedication

Yashoda Movie: సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక నటులు నటించిన ఈ చిత్రంలో నటి సమంత డెడికేషన్ కు చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ హ్యాట్సాఫ్ చెప్పారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై హరి, హరీష్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యశోద చిత్రం ఈ నెల 11న పాన్ ఇండియాగా రిలీజ్ అవతోంది. ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతూ డాక్టర్ ను పక్కన పెట్టుకొని సమంత ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పిన నేపథ్యంలో చిత్ర నిర్మాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ అనే విషయాలను తెలియచేశారు.

తాను నిర్మించిన ‘సమ్మోహనం’ చిత్రం తర్వాత డైరెక్ట్ సినిమా ‘యశోద’. 2020లో చెన్నైలో ఈ చిత్రానికి బీజంపడిందన్నారు. తమిళ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత సింధిల్ నడుమ దర్శకులు హరి, హరీష్ లు దగ్గర యశోధ సినిమా స్టోరీ వినడం జరిగింది. అనంతరం కరోనా రావడంతో సినిమా నిర్మాణంపై చర్చలు ఆగాయి. అనంతరం మరోసారి కథ విన్నా. బడ్జెట్ ఎంత? అని అడిగితే మూడు నాలుగు కోట్లు అన్నారు. మళ్ళీ కథ పై రీ వర్క్ చేశారు. ఏడెనిమిది నెలల తర్వాత స్క్రిప్ట్ సంతృప్తికరంగా వచ్చింది. ఆ టైమ్‌లో ‘పుష్ప’, ‘కేజిఎఫ్’ సినిమాలు డబ్బింగ్ జరుగుతన్న క్రమంలో యశోద సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనుకొన్నాం.

Yashoda Stills - Pictures | nowrunning

మహిళా ఓరియంటెడ్ చిత్రం కావడంతో ఆ పాత్ర ఎంపికకు తగ్గ కధానాయికగా సమంత్ ను గుర్తించామన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 తో సమంతకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో యశోధ సినిమాకు ఆవిడను ఎంపిక చేశామన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న సమంత కథ వినడం, ఓకే చేయడంతో సినిమా చిత్రీకరణలో తొలి అడుగు పడిందన్నారు. చిత్ర కథలోని డిమాండ్ తో సమంత తర్వాత మరో కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నాం.

సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత ఆరోగ్యం గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్ చెప్పేశారు. తమిళం డబ్బింగ్ టైం లో ఆమెలోని ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పించవచ్చని అన్నాను. తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసంటూ నాలుగు రోజులపాటు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ నిర్మాత సమంతను అభినందించారు. దేశ వ్యాప్తంగా సరోగసీపై జరుగుతున్న క్రైమ్ ను సినిమాలో చూపించే ప్రయత్నం చేశామన్నారు.

కరోనా మూడో వేవ్ లో సినిమా షూటింగ్ కొరకు ఆసుపత్రి లొకేషన్ కావాల్సి వచ్చింది. దీంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సూచనలతో మేమే హాస్పిటల్ సెట్స్ వేసుకొని 55 రోజులు ఆ సెట్స్ లో షూటింగ్ చేశామని తెలిపారు. దర్శకులు హరి, హరీష్ ఇద్దరూ తమిళులు కావడంతో తెలుగులో మాటలు రాయడానికి సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి లు కథానుగుణంగా ఇద్దరూ చక్కటి మాటలు రాశారు. దర్శకులకు కూడా వాళ్ల వర్క్ నచ్చడంతో మాకు సులువైందన్నారు.

Yashoda teaser: Samantha Ruth Prabhu's actioner has her playing a pregnant spy | Entertainment News,The Indian Express

సెన్సార్ సమయంలో సినిమా చూసి ఎగ్జైట్ అయ్యారన్నారు. హిందీలో సెన్సార్ అధికారి చూసి దక్షిణాధి వాళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారు అని చెప్పారన్నారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ను ఏపీ, తెలంగాణలో సునీల్, ఉత్తరాన యూఎఫ్ఓ, కర్ణాటకలో డిస్నీ, తమిళనాడు, మలయాళంలో సూర్య కంపెనీల ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. చింతా గోపాలకృష్ణరెడ్డి గారు సహ నిర్మాతగా యశోద చిత్రం రూపుదిద్దుకొందన్నారు.

ఇది కూడా చదవండి: Nacchindi Gal Frendoo: ఈ నెల 11న “నచ్చింది గాళ్ ఫ్రెండూ” సినిమా రిలీజ్- దర్శకుడు గురుపవన్

Exit mobile version
Skip to toolbar