Site icon Prime9

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు పవర్ గ్లాన్స్ కు 10 మిలియన్లకు పైగా వ్యూస్

Hari Hara Veera Mallu Power Glance

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా రిలీజయిన హరి హర వీర మల్లు యొక్క ‘పవర్ గ్లాన్స్’ యూట్యూబ్‌లో సంచలనం రేకెత్తించింది. ఒక రోజు వ్యవధిలో, ‘పవర్ గ్లాన్స్’ 10+ మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి యూట్యూబ్ లో అగ్రస్థానంలో ఉంది.

క్రిష్ జాగర్లమూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్న హరి హర వీర మల్లు పవర్ గ్లాన్స్ ప్రత్యేక గ్లింప్స్ పవన్ కళ్యాణ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ మరియు చరిష్మాతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన వీరుడి కథను చెబుతుంది.

తాజా గ్లింప్స్ లాంచ్ అయిన తర్వాత హరి హర వీర మల్లు చిత్రానికి హైప్ విపరీతంగా పెరిగింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

Exit mobile version