Site icon Prime9

Race Gurram: బన్నీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ నెలలో రేసుగుర్రం రీరిలీజ్

Resugurram

Resugurram

Tollywood: పాత చిత్రాలను థియేటర్లలో మళ్లీ విడుదల చేయడమనేది ఇపుడు ట్రెండ్‌లో ఉంది. ఇది ప్రేక్షకులను థియేటర్‌లకు ఆకర్షించడానికి గొప్ప మార్గంగా కనిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ పోకిరి, 16 సంవత్సరాల క్రితం విడుదలైన చిత్రం, యుఎస్‌లో 4కె టెక్నాలజీలో రీమాస్టర్ చేసి మళ్లీ విడుదల చేయడంతో ఈ ట్రెండ్ ఇటీవల ప్రారంభమైంది. తరువాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సెప్టెంబర్ 1న రీ-రిలీజ్ అయిన జల్సా సినిమాకు రెండు రోజులు స్పెషల్ షోలు వేశారు.

అదే ట్రెండ్‌ను అనుసరించి, ఈ నెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రేసు గుర్రం మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. వర్షం, బాద్షా చిత్రాల తర్వాత, నట్టి కుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రేసు గుర్రంను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ పుష్ప 2 కోసం సన్నాహాలు ప్రారంభించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నిమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది.

Exit mobile version