Site icon Prime9

Ram-Boyapati movie: రామ్, బోయపాటి మూవీకి ఫైనాన్స్ ప్రోబ్లమ్

Ram-Boyapati movie

Ram-Boyapati movie

Tollywood: ఇస్మార్ట్ శంకర్ “తో రామ్ పోతినేని హిట్ కొట్టినప్పటికీ రెడ్ మరియు వారియర్ ఫ్లాప్‌లు అతడిని బాగా దెబ్బతీశాయి. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం బోయపాటి శ్రీనుతో రామ్ కొత్త చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా ముందుకు సాగలేదు.

చాలా రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కావలసి ఉంది. అయితే నిర్మాత శ్రీనివాస చిట్టూరి ది వారియర్ కూడ అతనే నిర్మించాడు. ఈ సినిమా ప్లాప్ కావడంతో బాగా నష్టపోయాడని తెలుస్తోంది. తరువాత అతను కొంత మొత్తాన్ని నాగ చైతన్య మరియు వెంకట్ ప్రభు సినిమా పై పెట్టుబడి పెట్టాడు. దీనితో రామ్ సినిమా ముందుకు సాగడం లేదు. మేకర్స్ రెండు షెడ్యూల్‌లను ప్రకటించారు. కానీ నిధుల కొరత కారణంగా చివరి నిమిషంలో వాటిని రద్దు చేశారు.

ఫైనాన్స్ కోసం మేకర్స్ జీ స్టూడియోస్‌తో చర్చలు జరుపుతున్నారు. సినిమా నిర్మాత శ్రీనివాస చిట్టూరి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దసరా తర్వాత షూటింగ్ ప్రారంభిస్తామని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఈ వారంలో మంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.

 

Exit mobile version