Site icon Prime9

Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా రిలీజ్ పై ఉత్కంఠ.. విడుదల తేదీ పై నెట్టింట వైరల్

Excitement on the release of Ponnian Selvan Part 2 movie

Tollywood: తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాలో తారాగణం విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. సెప్టెంబర్ 30వ తేదిన ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైంది.

తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయింది. ఇతర భాషల్లో కూడా సినిమా సక్సెస్ సాధించింది. దీంతో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాను 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నాయి. దీంతో మరోమారు పొన్నియన్ సెల్వన్ సినిమా మూవీ1 విశేషాలను ప్రేక్షకులు తలుచుకొంటున్నారు.

కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా లైఫ్ టైమ్ డ్రీమ్ అంటూ మణిరత్నం ప్రకటించారు. బాహుబలి ఇచ్చిన సక్సెస్‌తో మణి రత్నం ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు. కలక్షన్ వారీగా కూడా పొన్నియన్ సెల్వన్ మూవీ దాదాపుగా 400కోట్లకు పైగా రాబట్టిందని ఇండస్ట్రీ టాక్. మణిరత్నం ఈ సినిమాను రెండు పార్టులగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఫార్ట్ చూసిన ప్రేక్షకులు సకెండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ రాణి నందినిగా నటించగా, చోళ యువరాణి కుందవై పిరత్తియార్ పాత్రలో త్రిష నటించింది. జయం రవి అరుల్మొళి వర్మన్ (పొన్నియన్ సెల్వన్) పాత్రను పోషించారు. మొత్తం మీద బాహుబలి లాంటి సినిమాలు ఇతర భాషల్లోని సిని దర్శకులను కదిలించిందని ఖచ్ఛితంగా చెప్పాల్సిందే.

ఇది కూడా చదవండి: Kamal Haasan: సిని ఇండస్ట్రీలో వారిద్దరు స్టైలే వేరు.. 35 ఏళ్ల తర్వాత వారి కాంభినేషన్ లో ఓ సినిమా.. ఎవరంటే?

Exit mobile version