Site icon Prime9

Hello Meera: హలో మీరా ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ వీవీ వినాయక్

Hello Meera

Hello Meera

Tollywood:  కాకర్ల శ్రీనివాసు దర్శకత్వంలో రూపొందుతున్న హలో మీరా ట్రైలర్ ను డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సందర్బంగా వినాయక్ మాట్లాడుతూ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా వచ్చిందని అన్నారు. కేవలం సింగిల్ క్యారెక్టర్ తీసుకొని ఇంత థ్రిల్ చేసే సినిమా తీయడమనేది ఓ సవాల్‌తో కూడిన పని అని, అందులో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని ఈ ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోందని అన్నారు. ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు వీవీ వినాయక్.

2 నిమిషాల 26 సెకనుల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని మీరా అనే సింగిల్ క్యారెక్టర్ ని చూపిస్తూ జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమా పై ఆసక్తి మరింత పెంచేలా చేసారు.

లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా, ఎస్ చిన్న సంగీతం అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version