Site icon Prime9

Dimple Hayathi: మాకేం డీజిల్, పెట్రోల్ ఫ్రీగా రావు కేటీఆర్ సార్.. డింపుల్ హయతి ట్వీట్ వైరల్

dimple hayathi About Hyderabad traffic

dimple hayathi About Hyderabad traffic

Dimple Hayathi: టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదంతో ఆమె మరింతగా మీడియా కథనాల్లో నిలుస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న హయతి, డీసీపీ రాహుల్ మధ్య కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం గురించి తెలిసిందే. ఆ గొడవ కాస్త ఇద్దరినీ కోర్టుల వరకు చేర్చింది. దీంతో ఈ గొడవ ఆ మధ్యకాలంలో పెద్ద చర్చ అయ్యింది. అసలే ఛాన్స్ లు తక్కువగా ఉన్న సమయంలో డింపుల్ ఏకంగా పోలీసులతో గొడవ పెట్టుకోవడం టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

అడుగైనా బయటపెట్టగలమా(Dimple Hayathi)

ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టులోనే కొనసాగుతుంది. ఈ సమయంలో మరోసారి డింపుల్ వార్తల్లో నిలించింది. తాను తాజాగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చగా మారింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీని ప్రశ్నిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద తాను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఫోటోలను షేర్ చేస్తూ.. “నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఈ ట్రాఫిక్ వల్ల ఇంటికి వెళ్ళాలంటే గంటకు పైగా సమయం పడుతుంది. ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఏంటి పరిస్థితి? అసలు హైదరాబాద్ లో అడుగైనా బయట పెట్టగలమా? ఫ్యూయల్ ఏమి ఫ్రీగా రావడం లేదు డియర్ గవర్నమెంట్” అంటూ కేటీఆర్ ని ట్యాగ్ చేసింది.

ట్వీట్ లో హైదరాబాద్ డీసీపీ ఎక్కడ అంటూ ఇన్‌డైరెక్ట్ గా డీసీపీ రాహుల్ హెగ్డేనే డింపుల్ ప్రశ్నించిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఇటీవల కోర్టులో వీళ్ళ కేసు విచారణ జరిగింది.

Exit mobile version