Site icon Prime9

Dil Raju: చిరు, బాలయ్య సినిమాలకు పోటీగా దిల్ రాజు తమిళ సినిమా

Dil Raju

Dil Raju

Tollywood: సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇపుడు ఈ రెండింటికి పోటీగా నిర్మాత దిల్ రాజు తమిళ సినిమాను తీసుకురావాలనుకోవడం సంచలనం కలిగిస్తోంది.

దిల్ రాజు తమిళ టాప్ స్టార్ విజయ్ తో ‘వరిసు’ అనే సినిమాని నిర్మిస్తున్నాడు. తెలుగు దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇక్కడ ‘వారసుడు’ అనే పేరుతో విడుదల అవుతుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ‘రంజితమే రంజితమే’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ బాషలలో విడుదల చెయ్యబోతున్నాడు దిల్ రాజు. అంతేకాదు దీనికోసం పెద్ద సంఖ్యలో ధియేటర్లు బుక్ చేస్తున్నాడు. దిల్ రాజు కి నైజాం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో థియేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు వారసుడు సినిమాకి తన థియేటర్స్ ని మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి థియేటర్స్ అన్నిటిని బుక్ చేసేస్తున్నాడు. ఉదాహరణకి వైజాగ్ సిటీ లో 14 థియేటర్స్ ఉండగా వీటిల్లో 6 థియేటర్స్ ని ‘వారసుడు’ సినిమాకి బుక్ చేసుకున్నాడు దిల్ రాజు.

తెలుగులో అంత పెద్ద మాస్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఇలా ఒక తమిళ సినిమాకి థియేటర్స్ అన్నిటిని బ్లాక్ చేసి తెలుగు సినిమాకి అన్యాయం చెయ్యడం ఏమిటి అని ఆడియన్స్ దిల్ రాజు పై విరుచుకుపడుతున్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి అధినేతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఇలాంటి పనులు చెయ్యడం సబబుగా లేదని అంటున్నారు. పండగ సీజన్‌లో మన చిరు, బాలయ్య సినిమాల కంటే డబ్బింగ్ సినిమా చూడాలా? పండగ సీజన్ లో మన తెలుగు సినిమాలకు తమిళనాడు వాళ్ళు ఇన్ని థియేటర్లు ఇస్తారా? అని వారు అడుగుతున్నారు. తమిళనాడులో అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న నేపథ్యంలో చిరంజీవి, బాలయ్య సినిమాలకు అక్కడ ఒక్క థియేటర్ కూడా దక్కే అవకాశం లేదు. తమిళ సినిమాలకు వాళ్ళు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, మనం ఎందుకు మన తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు ? అంటూ దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version